close

గురువారం, అక్టోబర్ 29, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికా.. ఏకగ్రీవమా?

ప్రస్తుత ఛైర్మన్‌ కొండ్రెడ్డికి తప్పని పోటీ

నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి

మూడు డైరెక్టర్ల పోస్టులకు నామినేషన్లు దాఖలు చేస్తున్న

ప్రస్తుత ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఇద్దరు మహిళా సభ్యులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే : జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ, సహకార పరపతి సంఘం విజయా డెయిరీలో మూడు డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం జరిగింది. డెయిరీ పాలక మండలిలో రొటేషన్‌ పద్ధతిలో ఏటా ముగ్గురు డైరెక్టర్లు పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం పదవిలో ఉన్న 15 మందిలో నార్తుమోపూరు పాల ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు, ప్రస్తుత డైయిరీ ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, మరో ఇద్దరు మహిళా డైరెక్టర్లు ఉన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో మూడు పోస్టులకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో ప్రస్తుత పాలకవర్గం ఛైర్మన్‌, అధికార పార్టీ వైకాపాకు చెందిన కొండ్రెడ్డి రంగారెడ్డి, కోవూరు మండల మోడేగుంట నుంచి కె.ఇందిరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాంబపురం పాలఉత్పత్తి సంగం అధ్యక్షురాలు ఎస్‌.సాయి నిరోషా, ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లి ఎంపీఎంఏసీఎస్‌ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. కోట చంద్రశేఖర్‌రెడ్డి తెదేపా అభ్యర్థిగా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మహిళా సభ్యులిద్దరు ఏకగ్రీవమయ్యారు. దాంతో మిగిలిన డైరెక్టర్‌ పోస్టుకు ఇద్దరి మధ్యే పోటీ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. ఉపసంహరణ జరగకపోతే ఎన్నిక తప్పదు. మొత్తం 118 మంది పాల ఉత్పత్తి సొసైటీ అధ్యక్షులు ఓటర్లుగా ఉన్నారని ఎన్నికల అధికారి హరిబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.