close

శనివారం, ఆగస్టు 08, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ పంజా

90 కేసుల నమోదు.. అయిదుగురి మృతి

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : జిల్లాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. బుధవారం మరో 90 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన జారీ చేసింది. దాంతో కేసుల సంఖ్య 1764 నుంచి 1854కు పెరిగింది. కోవూరు మండలంలోని ఇనమడుగులో ఒకరు, పడుగుపాడులో ఒకరు, పాటూరులో ఒకరు, శాంతినగర్‌లో మూడు, కోవూరు సత్రంలో ఒకటి, కోవూరులో రెండు, సంగం మండలంలో రెండు, టీపీగూడూరు మండలంలోని వరిగొండలో ఒకటి, బోగోలు మండలంలోని కడనూతలలో ఒకటి, ఆత్మకూరు మండలంలోని నెల్లూరుపాళెంలో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఒకటి, ముత్తుకూరు మండలోని పంటపాళెంలో ఒకటి, ముత్తుకూరులో ఒకటి, కావలి అర్బన్‌లో రెండు, కోట మండలంలోని గునపాటిపాళెంలో ఒకటి, పొదలకూరు మండలంలో ఒకటి, కొడవలూరు మండలంలోని యల్లాయపాళెంలో ఒకటి, టపాతోపులో ఒకటి, అల్లూరు మండలంలో ఒకటి, గూడూరు అర్బన్‌లో ఒకటి, వెంకటగిరి పట్టణం రాణిపేటలో రెండు, నెల్లూరు అర్బన్‌లోని ఏసీనగర్‌లో రెండు, డైకాస్‌రోడ్డులో ఒకటి, నవాబుపేటలో మూడు, దర్గామిట్టలో అయిదు, మూలాపేటలో ఎనిమిది, శ్రీహరినగర్‌లో ఒకటి, అపోలో ప్రాంతంలో ఒకటి, అరవిందనగర్‌లో ఒకటి, బాలాజీనగర్‌లో ఒకటి, జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఒకటి, సరస్వతినగర్‌లో ఒకటి, కోటమిట్టలో మూడు, ముత్తుకూరు రోడ్డులో ఒకటి, శాంతినగర్‌లో రెండు, కావేరినగర్‌లో మూడు, రాంజీనగర్‌లో ఒకటి, ధనలక్ష్మీపురంలో ఒకటి, స్టోన్‌హౌస్‌పేటలో ఒకటి, శెట్టిగుంటరోడ్డులో ఒకటి, ఖుద్దూస్‌నగర్‌లో ఒకటి, నేతాజీనగర్‌లో ఒకటి, చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతంలో రెండు, రామ్మూర్తినగర్‌లో ఒకటి, హరనాథపురంలో ఒకటి, మాగుంట లేఅవుట్‌లో ఒకటి, బంగ్లాతోటలో ఒకటి, సంతపేటలో ఒకటి, ఏకేనగర్‌లో ఒకటి, చింతారెడ్డిపాళెంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నారాయణ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 26 మంది డిశ్ఛార్జి చేసి హోం క్వారంటైన్‌కు పంపినట్లు ఆ ఆస్పత్రి నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు తెలిపారు. జీజీహెచ్‌ కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 57 మంది డిశ్ఛార్జి అయినట్లు నోడల్‌ అధికారి నరేంద్ర తెలిపారు. వీరిలో హోం ఐసోలేషన్‌కు 52 మంది, ఒకరు డిశ్ఛార్జి, నలుగురిని స్విమ్స్‌ ఆస్పత్రికి పంపినట్లు పేర్కొన్నారు. దాంతో డిశ్ఛార్జిల సంఖ్య 1099కు పెరిగాయి.

40 చేరిన మృతుల సంఖ్య .. జిల్లాలో మరో అయిదుగురు కొవిడ్‌ బారిన పడి మృతిచెందారు. వీరిలో మూలాపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు, టీపీగూడూరు మండలానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు, కావలి మండలానికి చెందిన 56 ఏళ్ల వృద్ధురాలు, సంగం మండలానికి చెందిన 57 ఏళ్ల వృద్ధుడు, చెర్లోపల్లి ప్రాంతానికి చెందిన 81 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. ఈ మేరకు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దాంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 35 నుంచి 40కు చేరుకుంది. ఐసోలేషన్‌ కేంద్రాల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో 310 మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.