close

శనివారం, ఆగస్టు 08, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
12 కరోనా కేసుల నమోదు

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : జిల్లాలో బుధవారం మరో కరోనా 12 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడులో ఒకటి, విడవలూరు మండలంలోని పార్లపల్లిలో ఒకటి, చిల్లకూరు మండలంలోని చింతవరంలో ఒకటి, నెల్లూరులోని సంతపేటలో ఒకటి, హరనాథపురంలో మూడు, చిల్డ్రన్స్‌ పార్కు ప్రాంతంలో ఒకటి, మనుమసిద్ధినగర్‌లో ఒకటి, మూలాపేటలో ఒకటి, ఏసీనగర్‌లో ఒకటి, నవాబుపేటలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 831కు చేరుకుంది. జీజీహెచ్‌, నారాయణ కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జిలు జరగలేదు. ఐసోలేషన్‌ కేంద్రాల్లో 332 మంది చికిత్స పొందుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో 254 మంది ఉన్నారు.

మంగళవారం నమోదైన కేసుల వివరాలు

జిల్లాలో మంగళవారం 69 కేసులు నమోదైన విషయం విదితమే. అయితే ఈ కేసుల వివరాల చిరునామాలను గుర్తించడంలో ఆలస్యమవడంతో వివరాలను ప్రకటించలేదు. దీంతో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆ కేసుల వివరాలను ప్రకటించింది. సైదాపురం మండలంలోని పోతుగుంటలో ఒకటి, సంగం మండలంలోని చెర్లోవంగల్లులో రెండు, బుచ్చిలో ఒకటి, చిట్టమూరు మండలంలోని ఈశ్వవాకలో ఒకటి, బోగోలులో నాలుగు, నాయుడుపేటలో అయిదు, డీవీసత్రం మండలంలోని సూరపుఅగ్రహారంలో రెండు, తనయాలిలో ఒకటి, సూళ్లూరుపేటలో రెండు, జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాకలో ఒకటి, వెంకటగిరిలో మూడు, భైరవరంలో రెండు, నెల్లూరు రూరల్‌లో నరసింహకొండలో ఒకటి, తడ మండలంలోని రామాపురంలో ఒకటి, కరూరు మూడు, పూడి ఒకటి, కావలిలో ఒకటి, గూడూరులో ఒకటి, నెల్లూరులో అయ్యపగుడి కూడలిలో రెండు, దర్గామిట్టలో ఆరు, స్టోన్‌హౌస్‌పేటలో ఒకటి, పప్పులవీధిలో రెండు, రంగనాయకులపేటలో ఒకటి, ధనలక్ష్మీపురంలో మూడు, ఎన్టీఆర్‌నగర్‌లో ఒకటి, సంతపేటలో నాలుగు, బృందావనం కాలనీలో ఒకటి, చింతారెడ్డిపాళెంలో ఒకటి, శెట్టిగుంటరోడ్డులో ఒకటి, జెండావీధిలో ఒకటి, పొదలకూరురోడ్డులో ఒకటి, జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఒకటి, పద్మావతి కూడలిలో ఒకటి, రాజేంద్రనగర్‌లో రెండు, శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఒకటి, వీఎస్‌రెడ్డినగర్‌లో ఒకటి, నవాబుపేటలో ఒకటి, నేతాజీనగర్‌లో రెండు, బీవీనగర్‌లో ఒకటి, కొండాయపాళెం గేటు కూడలిలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.