close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి


మాట్లాడుతున్న జేసీ వినోద్‌కుమార్‌

 

నెల్లూరు (వైద్యం), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కంటి- వెలుగు కార్యక్రమంలో భాగంగా అరవై ఏళ్లు పైబడిన వారికి నిర్వహిస్తున్న కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని శెట్టిగుంటరోడ్డులో ఉన్న వైవీఎం పాఠశాలలో నిర్వహించిన కంటి- వెలుగు కార్యక్రమాన్ని జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి జులై వరకు మూడో విడత కంటి- వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాధ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కంటి- వెలుగులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేశారన్నారు. డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. అవసరమైన పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఎం హరిశ్చంద్ర సతీష్‌, కిసాన్‌నగర్‌ మాక్‌ కేంద్రం వైద్యాధికారి సింధు, స్థానిక నాయకులు కిన్నెర మాల్యాద్రి, రఘు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జేసీ వినోద్‌కుమార్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.