close

గురువారం, ఏప్రిల్ 02, 2020

తాజా వార్తలు

బాలల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయాలి

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ ఆర్‌.జి.ఆనంద్‌


మాట్లాడుతున్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ ఆర్‌.జి.ఆనంద్‌

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే: జిల్లాలో వారానికి ఒకసారి బాలల హక్కుల పరిరక్షణ కోసం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ ఆర్‌.జి.ఆనంద్‌ పేర్కొన్నారు. నెల్లూరు నూతన జడ్పీ సమావేశ మందిరంలో బాలల హక్కులు, సంరక్షణలపై చేపడుతున్న కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాలల సమస్యలు, వారిపై జరిగే వివిధ అకృత్యాలపై గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసి, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలు పటిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, జువనైల్‌ వెల్ఫేర్‌ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని బాలలను సంరక్షించాలన్నారు.

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయన్నారు. బాలల సంరక్షణకు కమిషన్‌ సభ్యులు సూచించిన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.జె.సుధ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బాలల హోమ్‌లో సరైన వసతులు లేవని, తమ పరిశీలనలో మరుగుదొడ్లు సక్రమంగా లేవని తెల్సిందన్నారు. ఐసీడీఎస్‌ పీడీ సుధాభారతి మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కోసం అపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. జువనైల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యులు ఇ.ఎస్‌.జగదీశ్వర్‌ మాట్లాడుతూ బాలల కోసం ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమాలపై ఎన్‌.జి.ఒ.లకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. జేజేబీలో కంప్యూటర్‌, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 కమలకుమారి, రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మలత, ఎన్‌.సి.పి.ఎల్‌. పి.డి.సుస్మితారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు జీవపుత్రకుమార్‌, ఐ.టి.డి.ఎ. పీవో మణికుమార్‌, ఏఎస్పీ మనోహర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ రాజ్యలక్ష్మి, సమగ్రశిక్ష పీవో, వివిధశాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.