close

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

తాజా వార్తలు

పోలీసు స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం అతను దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో తనకు తాను తలతో గోడను కొట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళితే.. పొదలకూరు రోడ్డులోని ఓ టిఫిన్‌ సెంటరులో జరిగిన గొడవకు సంబంధించి ఒక మహిళ దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంబంధిత కేసులో నిందితుడిని దర్గామిట్ట పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. అయితే, ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోడకు బలంగా ఢీకొనడంతో రక్తస్రావమైంది. అప్రమత్తమైన పోలీసులు 108ను రప్పించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు పోలీసులు ఆంబులెన్సును వెనక్కి పంపించేసి ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఒకటికి రెండుసార్లు స్టేషన్‌కు పిలవడం వల్ల ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. ఈ విషయమై దర్గామిట్ట ఇన్‌స్పెక్టరు నాగేశ్వరమ్మను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తాను అసెంబ్లీ విధుల్లో ఉన్నానని, విషయం గురించి తనకు సమాచారం లేదన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.