close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రక్తసిక్తం

వేర్వేరు ప్రమాదాల్లో 16 మందికి గాయాలు

దెబ్బతిన్న బస్సు ముందుభాగం

 

జిల్లాలో వేర్వేరు చోట్ల శనివారం జరిగిన ప్రమాదాల్లో 16 మందికి గాయాలయ్యాయి. కోల్‌కతా, చెన్నై జాతీయ రహదారిపై మనుబోలు వద్ద లారీని ఓ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనగా 10 మంది గాయపడ్డారు. అలాగే తిరుపతి మార్గంలో పెళ్లకూరు మండలంలోని తాళ్వాయపాడులో ట్రావెల్స్‌ బస్సు, బైక్‌ని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

మనుబోలు, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి కంటైనర్‌ లారీని ఢీకొన్న ఘటన మండల కేంద్రమైన మనుబోలులోని అడ్డరోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ట్రావెల్స్‌ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళుతోంది. ఇక్కడికి వచ్చేసరికి అదే మార్గంలో నెల్లూరు వైపు వెళుతున్న కంటైనర్‌ లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో వెనుకనే వస్తున్న ట్రావెల్స్‌ బస్సు ముందు వెళుతున్న వాహనాలను అధిగమించే క్రమంలో అదుపుతప్పి ఢీకొంది. దీంతో డ్రైవర్‌ మల్లికార్జున్‌, క్లీనర్‌ నాజ్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ శంకర్‌, ప్రయాణికులు సురేంద్ర, ఉష, సహన, సానియా, దినాషిష్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు స్పందించి ప్రయాణికులను బయటకు దింపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్సకు రహదారి అంబులెన్సు, 108 వాహనాల్లో నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ పరామర్శ.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ పరామర్శించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

బైక్‌, బస్సుని ఢీకొన్న కారు

తాళ్వాయపాడు (పెళ్లకూరు): ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని జాండ్రపేటకు చెందిన ఓ కుటుంబం తిరుమల వెళ్లింది. దైవదర్శనం చేసుకొని కారులో తిరిగి వస్తూ మండలంలోని తాళ్వాయపాడు దగ్గర ఎదురుగా వస్తున్న బైక్‌ను శనివారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ఇదే మార్గంలో బెంగళూరు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుని ఢీకొట్టింది. కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు డ్రైవర్‌ సూర్య, పార్వతి కాళ్లు విరిగాయి. ఉదయ్‌, ప్రశాంతితో పాటు మరోవ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే బైైక్‌పై వెళుతున్న వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే పెట్రోల్‌ వాహనం సాయంతో 108లో నాయుడుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నెల్లూరు తరలించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రయాణికులను వేరే బస్సులో పంపించేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.