కష్టపడి పనిచేస్తేనే తగిన ప్రతిఫలం: విప్‌ సునీత
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

కష్టపడి పనిచేస్తేనే తగిన ప్రతిఫలం: విప్‌ సునీత

నియామక పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత

మోటకొండూరు, న్యూస్‌టుడే: తెరాస పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రతిఫలం ఉంటుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్‌హాల్లో శనివారం జరిగిన ఆ పార్టీ మోటకొండూరు మండల కమిటీ ఎన్నికలో మాట్లాడారు. మండల శాఖ అధ్యక్షునిగా బొట్ల యాదగిరి, ప్రధాన కార్యదర్శులుగా అంబాల శ్రీనివాస్‌, బి,రవీందర్‌రెడ్డి, డి.శ్రీరామ్‌రెడ్డి, ఎస్టీసెల్‌ అధ్యక్షుడిగా అంగడి అరవింద్‌, ఎస్సీ సెల్‌కు బోడ మహేష్‌, మైనార్టీ విభాగానికి ఎండీ.మహ్మద్‌, మహిళా అధ్యక్షురాలిగా బి.నాగమణి, బీసీ విభాగానికి మల్గ గౌరయ్య, యువజన విభాగానికి బీస కృష్ణంరాజు, విద్యార్థి విభాగానికి దాసరి మల్లారెడ్డి, రైతు విభాగానికి ఎ.నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. ఎంపీపీ పి.ఇందిర, జడ్పీటీసీ సభ్యుడు పి.వెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఇల్లెందుల మల్లేష్‌, నాయకులు ఈరగాని శ్రీనివాస్‌గౌడ్‌, సిరిపురం భాస్కర్‌, పోతిరెడ్డి స్కైలాబ్‌రెడ్డి, సూదగాని రామదాసుగౌడ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని