మేదరుల సంక్షేమానికి కృషి: ఎంపీ బడుగుల
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

మేదరుల సంక్షేమానికి కృషి: ఎంపీ బడుగుల

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌కు వెదురుతో చేసిన వస్తువును

బహుమతిగా అందిస్తున్న సంఘం నాయకులు

బాలాజీనగర్‌ (సూర్యాపేట), న్యూస్‌టుడే: మేదర కులస్థుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మేదర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెదురు వస్తువుల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల్లో వెనకబడిన వర్గాల అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో మేదర సంఘం భవన నిర్మాణ స్థలం కేటాయించే విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. మేదర సంఘం నాయకులు మాట్లాడుతూ.. మేదరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల మల్లేషం, యాదగిరి, మల్లయ్య, యాదయ్య, వెంకన్న, నిరంజన్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని