ట్రాక్టర్‌ పైనుంచి పడి యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

ట్రాక్టర్‌ పైనుంచి పడి యువకుడి దుర్మరణం

తిప్పర్తి, న్యూస్‌టుడే: తిప్పర్తి మండలం ఇండ్లూరు శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాల్‌జాని (19) అనే యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన రాముజాని తన భార్య, ముగ్గురు కుమారులతో కలిసి 8 ఏళ్ల కిందట ఇండ్లూరుకు వలస వచ్చారు. ఇక్కడి స్టోన్‌ క్రషర్స్‌లో కూలిగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రాముజాని మూడో కుమారుడు గోపాల్‌జాని మరో ముగ్గురు కూలీలతో కలిసి కిరాణ సామాను కొనేందుకు ఇండ్లూరుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్టోన్‌క్రషర్స్‌కు చెందిన ట్రాక్టర్‌ రావడంతో దానిపై ఎక్కారు. గోపాల్‌జాని డ్రైవర్‌ పక్కన, మిగిలిన ముగ్గురు ట్రాలీలో కూర్చున్నారు. ట్రాక్టర్‌ వాహనాన్ని నడుపుతున్న అబ్బగోని సాయికుమార్‌ అతివేగంగా, అజాగ్రత్తగా వెళుతూ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో డ్రైవర్‌సీటు పక్కన కూర్చొని ఉన్న గోపాల్‌జాని ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని