కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన

మిర్యాలగూడ మండలం ఆలగడపలో భూముల వివరాలు తెలుసుకుంటున్న

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌

మిర్యాలగూడ లీగల్‌, న్యూస్‌టుడే: మిర్యాలగూడలోని న్యాయస్థానాల భవన సముదాయం ఇరుకుగా ఉండడంతో నూతన భవనాల నిర్మాణానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ మిర్యాలగూడ మండలంలోని ఆలగడపలో శనివారం ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఆలగడప శివారులోని 828, 829, 830, 832 సర్వే సంఖ్యలోని 12 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, సర్వే అధికారులతో భూముల వివరాలపై చర్చించారు. అంతకుముందు పట్టణంలోని ఎన్నెస్పీ అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కోర్టు హాలును పరిశీలించారు. ఆయన వెంట ఎనిమిదో అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్‌రెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి, ఆర్డీవో రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ గణేష్‌, డివిజన్‌ సర్వేయర్‌ బాలాజీనాయక్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని