తప్పులు లేకుండా ఓటరు జాబితా
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

తప్పులు లేకుండా ఓటరు జాబితా

దూరదృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎన్నికల డీటీ విజయ్‌

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: ఓటుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తప్పులు లేకుండా పరిపూర్ణమైన ఓటరు జాబితా తయారీకి కృషిచేస్తామని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్‌ గోయల్‌ నిర్వహించిన దూరదృశ్య శ్రవణ సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా ఎన్నికల డీటీ విజయ్‌ పాల్గొన్నారు.

ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఫొటో ఓటరు జాబితా సవరణ 2021 కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు చేసుకున్న వారు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. యూనిక్‌ నెంబర్‌ ద్వారా 2021 ఫొటో ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఈ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని