close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హుండీల ఆదాయం లెక్కింపు
మట్టపల్లి ఆలయంలో హుండీల నగదు లెక్కింపును పరిశీలిస్తున్న
సహాయ కమిషనర్‌ మహేందర్‌కుమార్‌

మఠంపల్లి, న్యూస్‌టుడే: మట్టపల్లి లక్ష్మీనృసింహునికి హుండీల ద్వారా రూ.10.59 లక్షలు ఆదాయం సమకూరింది. ఎనిమిది నెలల అనంతరం ఆలయంలోని హుండీలలో తీర్థజనులు మొక్కులు, కానుకల రూపంలో సమర్పించిన నగదును గురువారం దేవాదాయశాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా సహాయ కమిషనర్‌ కె.మహేందర్‌కుమార్‌ సమక్షంలో లెక్కించారు. శ్రీస్వామి సన్నిధిలోని హుండీల ద్వారా రూ.10.24 లక్షలు, అన్నప్రసాద వితరణ మండపంలోని హుండీల ద్వారా రూ.35 లక్షలు వచ్చినట్లు ఆలయ ఛైర్మన్‌ చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈవో ఎస్‌.నవీన్‌ తెలిపారు. జనవరి 29న చివరిసారిగా హుండీలను తెరిచి నగదును లెక్కించినట్లు చెప్పారు. మిర్యాలగూడ డివిజనల్‌ తనిఖీ అధికారి ఇ.రమేష్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ కర్యక్రమంలో ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంప్రదాయ ఉట్లోత్సవం

ఆలయంలో రెండ్రోజులుగా నిర్వహిస్తోన్న శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం సంప్రదాయ రీతిలో ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. యాదవుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాలు జరిగాయి.

ఆలయ ఛైర్మన్‌గా విజయ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

లక్ష్మీనృసింహుని ఆలయ ఛైర్మన్‌గా చెన్నూరు విజయ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను నిర్వహించిన సీహెచ్‌ మట్టపల్లిరావు పదవీ కాలం ఈనెల 12న ముగిసింది. దేవాదాయశాఖ ఏసీ కె.మహీందర్‌కుమార్‌, ఈవో, అర్చకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.