close

సోమవారం, సెప్టెంబర్ 21, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్జీ కళాశాలకు అరుదైన గౌరవం
నల్గొండ ఎన్జీ కళాశాల

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నల్గొండ నాగార్జున ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ, పీజీ కళాశాలకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ నేషనల్‌ మ్యాగజైన్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ రిపోర్ట్‌-2020 ప్రకారం చేసిన సర్వేలో ఈ కళాశాలకు జాతీయస్థాయిలో 16వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు లభించింది. ఈ సంస్థ దేశంలోని అటానమస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదుపాయాలు, బోధన పద్ధతులు, పరిశోధనలు, విద్యార్థుల ప్రగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించింది. ఎన్జీ కళాశాల 2007-08 విద్యా సంవత్సరంలో అటానమస్‌ కళాశాలగా ఏర్పడి, ప్రస్తుతం న్యాక్‌ ఏ గ్రేడ్‌ గుర్తింపుతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 29 డిగ్రీ కోర్సుల్లో 4500 మంది, 5 పీజీ కోర్సుల్లో 450 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలకు జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు రావడం పట్ల ప్రిన్సిపల్‌ రహత్‌ఖానం సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.