రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
eenadu telugu news
Updated : 30/07/2021 05:46 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విష్ణు

అమ్రాబాద్‌, న్యూస్‌టుడే : ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి వాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలతో మృతిచెందిన ఘటన అమ్రాబాద్‌ సమీపంలో చోటు చేసుకుంది. అమ్రాబాద్‌ ఎస్సై వెంకటయ్య కథనం ప్రకారం.. అమ్రాబాద్‌ మండలం మాధవానిపల్లికి చెందిన ఉప్పునుంతల విష్ణు(40) బుధవారం రాత్రి మన్ననూర్‌ వైపు నుంచి అమ్రాబాద్‌ వైపునకు వస్తున్నాడు. తుర్కపల్లి స్టేజి సమీపంలో అతడి ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై వెళుతున్న వారు 108కు సమాచారం ఇవ్వగా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. విష్ణు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విష్ణుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని