close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నల్లమలకు చిరుత తరలింపు


అడవిలో వదిలేముందు బోనులో చిరుత

మన్ననూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగర పరిధిలోని రాజేంద్రనగర్‌లో జన సంచారంలో ఆరు నెలలుగా కలకలం సృష్టించిన చిరుతను పట్టుకుని అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలో శనివారం సాయంత్రం వదిలారు. రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్‌ శోభ పర్యవేక్షణలో అటవీశాఖ వన్యప్రాణుల అంబులెన్సులో శనివారం చిరుతను నల్లమలకు తీసుకువచ్చి జూపార్క్‌ సిబ్బందితో కలిసి వదిలారు. గత మే నెలలో రాజేంద్రనగర్‌ పరిధిలో గల బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని బ్రిడ్జి కింద రహదారిపై చిరుత పడుకొని ఉండగా.. స్థానికులు గుర్తించి నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులకు సమాచారం అందించడంతో అటవీ అధికారులు ఆరు నెలలుగా దానిని పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. రాజేంద్రనగర్‌, చిలుకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ చిరుత భయానక వాతావరణాన్ని సృష్టించింది. గ్రేహౌండ్స్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టు గోడ దూకి సంచరించింది. ఈ నెల 9న రాజేంద్రనగర్‌లోని రెండు పశువులపై చిరుత దాడి చేసి చంపేయగా, అప్రమత్తమైన అటవీ అధికారులు సీసీ ఫుటేజీల ఆధారంగా అక్కడే బోనులో బంధించి పట్టుకున్నారు. బోనులో ఆగ్రహంతో ఊగిపోయిన చిరుత తల భాగంగా కాస్త గాయమవ్వగా, దానికి చికిత్స నిర్వహించి ఆరోగ్యంగా ఉండేలా చేశామని పీసీసీఎఫ్‌ శోభ తెలిపారు. జనసంచారంలో తిరగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో చిరుత జీవనం సాగించే విధంగా అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతాన్ని ఎంచుకుని అడవిలో వదిలామని, గతేడాది నల్లమలలో వదిలిన రెండు పులులు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నెహ్రూ జూపార్కు క్యూరేటర్‌ క్షితిజ, అమ్రాబాద్‌ అభయారణ్య క్షేత్ర సంచాలకులు ఏకే సిన్హా, డీఎఫ్‌ఓ కిష్టగౌడ్‌, ఎఫ్‌డీఓలు సుధాకర్‌, రాజశేఖర్‌, రేంజ్‌ అధికారులు ప్రభాకర్‌, రవిమోహన్‌ భట్‌, శిక్షణ రేంజ్‌అధికారులుపాల్గొన్నారు.


చిరుతను అడవిలో వదులుతుండగా పరిశీలిస్తున్న పీసీసీఎఫ్‌ శోభ, అటవీ అధికారుల బృందం

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.