రోగులకు పండ్ల పంపిణీ
eenadu telugu news
Updated : 17/09/2021 16:46 IST

రోగులకు పండ్ల పంపిణీ

ఆదోని మార్కెట్‌: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో భాజపా నాయకులు శుక్రవారం రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతోందని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్‌జైన్‌ తెలిపారు. అవినీతి రహిత పాలనతో ప్రపంచ దేశాలను ఆకట్టుకునేలా కేంద్రంలో పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విట్టా రమేశ్‌, జిల్లా కార్యదర్శి నాగరాజుగౌడ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాసులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని