‘ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం’
eenadu telugu news
Updated : 17/09/2021 16:46 IST

‘ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం’

ఆదోని మార్కెట్‌: దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ పరం చేస్తోందన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారని, ధరల నియంత్రణ చేతల్లో చూపించాలన్నారు. అన్ని సమస్యలపై ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే భారత్‌ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. సమావేశంలో నాయకులు ఈరన్న, మహానందరెడ్డి, తిప్పన్న, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని