Srisailam: శ్రీశైలానికి జలకళ.. ఏడు గేట్ల ద్వారా నీరు విడుదల
eenadu telugu news
Updated : 17/09/2021 13:33 IST

Srisailam: శ్రీశైలానికి జలకళ.. ఏడు గేట్ల ద్వారా నీరు విడుదల

సున్నిపెంట సర్కిల్‌: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం 7 రేడియంట్‌ క్రస్ట్‌ గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,95,881 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ అదనంగా మరో 58,561 క్యూసెక్కులను నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. 

ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 1,25,731 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 38,799 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం  884.80 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలు నమోదైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని