పరిశ్రమల ఏర్పాటుకు సహకారం
eenadu telugu news
Published : 17/09/2021 03:59 IST

పరిశ్రమల ఏర్పాటుకు సహకారం


మాట్లాడుతున్న కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన వెల్దుర్తిలో రూ.3.10 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైను పనులను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, వైకాపా రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఎంపీ నిధులు రూ.5 కోట్లు మంజూరవుతాయన్నారు. వీటిలో పత్తికొండ నియోజకవర్గానికి రూ.60 లక్షలు అందిస్తామన్నారు. వాటిని ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు వినియోగించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెల్దుర్తిలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృష్ణగిరి జలాశయం నుంచి ఫిల్టర్లను ఏర్పాటు చేసి శుద్ధ జలాన్ని అందిస్తున్నామన్నారు. ఈ పథకంతో వెల్దుర్తిలో నీటి సమస్య ఉండబోదన్నారు. రెండు, మూడు నెలల్లో నియోజకవర్గంలోని చెరువులకు సైతం హంద్రీనీవా నుంచి నీటిని తరలిస్తామన్నారు. వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయిస్తామన్నారు. అనంతరం తాగునీటి పథకాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్‌ రవిరెడ్డి, సర్పంచి శైలజ, కృష్ణగిరి మండల వైకాపా బాధ్యులు వెంకట్రామిరెడ్డి, వైకాపా నాయకులు పెద్దిరెడ్డి, సమీర్‌కుమార్‌రెడ్డి, వెంకటనాయుడు, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని