నిందితులను కఠినంగా శిక్షించాలి
eenadu telugu news
Updated : 17/09/2021 03:59 IST

నిందితులను కఠినంగా శిక్షించాలి


నిరసన తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు

నంద్యాల గ్రామీణం,న్యూస్టుడే: పట్టణ చిల్లర వర్తక సంఘం అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆర్యవైశ్య ప్రముఖులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అమ్మవారిశాలలో వెంకట సుబ్బయ్య హత్యను నిరసిస్తూ కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాశి వాసు, గంగిశెట్టి విజయకుమార్‌, కౌన్సిలర్‌, శ్యాంసుందర్‌లాల్‌ తదితరులు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో వ్యాపారులకు రక్షణ కావాలన్నారు. కొంతమంది రౌడీలు పెత్తనాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు నిరసనగా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా వెళ్లి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని