బతికున్న తండ్రినీ చంపేశారు 
eenadu telugu news
Updated : 17/09/2021 11:53 IST

బతికున్న తండ్రినీ చంపేశారు 

●నకిలీ ధ్రువపత్రంతో ఆస్తికి ఎసరు


వివరాలు వెల్లడిస్తున్న బాధితుడు

 

అవుకు, న్యూస్‌టుడే: బుడిబుడి నడకల వయసు నుంచి కష్టపడి పెంచిన తండ్రి బతికున్నా.. చనిపోయాడంటూ ఓ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించి ఆస్తికి ఎసరు పెట్టిన కుమారుల అక్రమ వ్యవహారం గురువారం వెలుగుచూసింది. బాధితుడు బాలతిమ్మయ్య వివరాల మేరకు.. మండలంలోని వేములపాడుకు చెందిన గిద్దలూరు బాల తిమ్మయ్య మరణించినట్లు ఆయన కుమారులు ధ్రువపత్రం తయారు చేశారు. లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బాధితుడు బాలతిమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. తనకు ఇద్దరు భార్యలున్నారని, మెదటి భార్య గతించిన అనంతరం రెండో వివాహం చేసుకుని నంద్యాలలో నివాస ముంటున్నానని ఆయన పోలీసులకు తెలిపారు. అవుకు మండలం వేేములపాడులో తనకున్న 5.36 ఎకరాల వ్యవసాయ భూమిపై తొలి భార్యకు కలిగిన ముగ్గురు కుమారులు కన్నేశారని, తాను మరణించినట్లుగా ధ్రువపత్రం సంపాదించి అవుకు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆస్తి రిజిస్టరు చేయించుకున్నారని ఆరోపించారు. తన పొలం తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందుతున్నానని, ఈసీ తీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఆస్తికి సంబంధించి తన పేరుకు బదులు కుమారుల పేర్లు వచ్చాయని వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై జగదీశ్వరరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని