అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు


కాళికాంబ ఆలయంలో ఈవోలతో సమావేశమైన డీసీ రాణా ప్రతాప్‌

నంద్యాల సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు డీసీ (దేవాదాయశాఖ ఉప కమిషనర్‌) రాణా ప్రతాప్‌ పేర్కొన్నారు. దేవాదాయశాఖ అధికారులతో కలిసి నంద్యాలలోని పలు ఆలయాల్లోని పత్రాలను గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారా జరగాలని సూచించారు. మూలమఠంలోని బ్రహ్మనందీశ్వర ఆలయంలో కల్యాణ మండపం సందర్శించి ఈవో రామాంజనేయశర్మకు సూచనలిచ్చారు. నంద్యాల డివిజన్‌ పరిధిలోని ఈవోతో కాళికాంబ ఆలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ డబ్బులు చేతికివ్వడం తగ్గించాలని చెప్పారు. అలా లేని వారికి శిక్షణ ఇచ్చి వారు ఆన్‌లైన్‌ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీ ఆదిశేషులునాయుడు మాట్లాడుతూ పత్రాలు సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు తిరుమలరెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి, వేణునాథరెడ్డి, స్వర్ణముఖి, వీరయ్య, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని