టమాటా కిలోరూ.2
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

టమాటా కిలోరూ.2


ప్యాపిలి మార్కెట్‌కు వచ్చిన టమాటా

ప్యాపిలి, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్యాపిలి మార్కెట్‌లో టమాటా ధర పతనమైంది. గురువారం కిలో ధర కేవలం రూ.2 పలికింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎన్నో ఆశలతో మార్కెట్‌కు దిగుబడులు తరలించిన రైతులు ధర చూసి డీలా పడిపోయారు. కనీస రవాణా ఛార్జీలు కూడా చేతికి రావడం లేదని మండలంలోని పెద్దపూదెళ్ల, కలచాట్ల, గుడిపాడు తదితర గ్రామాల రైతులు వాపోయారు. పత్తికొండ టమాటా మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. 25 కిలోల జత బుట్టల టమాటా రూ.120 నుంచి రూ.140 పలికింది. వారం రోజులుగా ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని