నేడు స్నాతకోత్సవం
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

నేడు స్నాతకోత్సవం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: మూడో స్నాతకోత్సవ సంబరాలకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌) కళాశాల సిద్ధమైంది. వర్చువల్‌ విధానంలో కార్యక్రమాన్ని జరిపేలా అధికారులు సాంకేతిక సహకారాన్ని విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చారు. 2015లో 190 ఎకరాల్లో రూ.250 కోట్ల అంచనాలతో ఏర్పాటైన ట్రిపుల్‌ఐటీ కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరోవైపు స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కళాశాల డైరెక్టర్‌ డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు నివేదికను సమర్పించనున్నారు. కళాశాల ఛైర్మన్‌ హెచ్‌.ఎ.రంగనాథ్‌ అధ్యక్షత వహించనుండగా బెంగళూరు ఐఐఎస్‌సీ మాజీ డైరెక్టర్‌ పి.బలరామ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీటెక్‌ కోర్సుల్లో ఈ ఏడాది ఉత్తీర్ణులైన 101 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆయా విభాగాల్లో ప్రతిభావంతులకు బంగారు పతకాలు అందజేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని