ఆలయ భూములకు ఇళ్ల పట్టాలా?
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

ఆలయ భూములకు ఇళ్ల పట్టాలా?

● విచారణ అనంతరం తహసీల్దారు అంజనాదేవిపై వేటు

ఆలయ భూమిలో వెలసిన గుడిసెలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నంద్యాల తెలుగుగంగ ప్రాజెక్టులో ప్రత్యేక తహసీల్దారుగా పనిచేస్తున్న అంజనాదేవిపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఆమె కల్లూరు తహసీల్దారుగా పనిచేసిన సమయంలో ఆలయ భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చారు. నంద్యాల రహదారిలోని దూరదర్శన్‌ టవర్‌ వెనకాల 3.25 ఎకరాల్లో 72 మందికి పట్టాలు పంపిణీ చేశారు. సర్వే నంబరు 655లోని 8.25 ఎకరాలు రాంబొట్ల దేవాలయానికి చెందినది. అందులో 5 ఎకరాలను గతంలో దూరదర్శన్‌కు అప్పటి కలెక్టర్‌ కేటాయించారు. మిగిలిన 3.25 ఎకరాలు ఉండగా 2010లో అంజనాదేవి రెవెన్యూ దస్త్రాలను తారుమారు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఆలయ సేవకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఆర్డీవోతో విచారణ చేయించగా వాస్తవమేనని నిర్ధారణ కావడంతో ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్‌ విషయాన్ని జిల్లా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని