ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటు అవసరం
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటు అవసరం


ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించిన నాయకులు, విద్యార్థులు

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదోనిలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ గురువారం విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. జేఏసీ గౌరవ సలహాదారుడు సాబీర్‌బాషా, గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు, ఛైర్మన్‌ నాగరాజు, కన్వీనరు శ్రీనివాసులు, రమేశ్‌ మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థలు లేకపోవడంతో గ్రామీణ, పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు శివరాం, శివలోకేశ్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని