ఎస్సీ, ఎస్టీ కేసులు సత్వరమే పరిష్కరించాలి
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

ఎస్సీ, ఎస్టీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల మేరకు ఛార్జిషీట్‌ ఫైల్‌ చేసి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని గురువారం జూమ్‌ కాన్ఫరెన్సులో నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2016- 2021 వరకు 1,817 కేసులు నమోదు చేయగా 1,413 కేసులకు సంబంధించి రూ.19.40 కోట్ల నష్ట పరిహారాన్ని బాధితులకు అందజేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ పెండింగ్‌లో కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లోని కాలనీలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టాలని కోరారు. డీవీఎంసీ సభ్యులు సాయిప్రదీప్‌, సభ్యులు రాజశేఖర్‌, రమేష్‌బాబు, రవికుమార్‌, దస్తగిరి, మమతారెడ్డి పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని