ఓట్ల లెక్కింపునకు సన్నద్ధమవ్వండి
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

ఓట్ల లెక్కింపునకు సన్నద్ధమవ్వండి


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉండాలని కలెక్టరు కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం జడ్పీ పరిపాలనా భవనంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీలు రాంసుందర్‌రెడ్డి, మనజీర్‌ జిలానీ సామూన్‌, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, ఉప సీఈవో భాస్కర నాయుడు, డీపీవో ప్రభాకరరావు పాల్గొన్నారు. కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో లెక్కింపు జరిగే కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం చేయాలని, సిబ్బంది నియామకం, విద్యుత్‌ వసతితో పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. కేంద్రాల్లో బారికేడింగ్‌, మెష్‌ ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన టేబుళ్లు సిద్ధం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టరు, జేసీ రాంసుందర్‌ రెడ్డి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని