మనకు ఆంత్రాక్స్‌ ముప్పు లేదు..
eenadu telugu news
Updated : 28/10/2021 04:19 IST

మనకు ఆంత్రాక్స్‌ ముప్పు లేదు..


ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: పొరుగున ఉన్న వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. గత నాలుగు రోజుల నుంచి దుగ్గొండి మండలం చాపలబండలో ఓ రైతుకు చెందిన నాలుగు గొర్రెలు రక్తం కక్కుతూ మృతి చెందాయి. ఆంత్రాక్స్‌ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకుతుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలో కూడా అనేక మంది గొర్రెల కాపరులు  ఆందోళనకు గురయ్యారు. కానీ జిల్లాలో ఎక్కడా ఆంత్రాక్స్‌ వ్యాధి ఆనవాళ్లు లేవని, మనకు ఎలాంటి ముప్పు లేదని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వేణుమనోహర్‌ చెప్పారు. ఈ విషయంలో పశుసంవర్ధకశాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని, అందువల్ల గొర్రెలకాపరులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని