‘ఇన్నోవేషన్‌’లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

‘ఇన్నోవేషన్‌’లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న డీఈవో యాదయ్య తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌-2021 సంవత్సరానికి సంబంధించిన గోడ పత్రికను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో ఎస్‌.యాదయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయిలో టాప్‌ ఐదులో జిల్లా నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎంపికకావటం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ స్కూల్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, యూనిసెఫ్‌, ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇది విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ ఏడీ వెంకటేశ్వరాచారి, ఎస్‌ఎస్‌ఏ  సెక్టోరియల్‌ కోఆర్డినేటర్లు రామకృష్ణ, రాజశేఖర్‌, జీసీడీవో ఉదయశ్రీ, జిల్లా సైన్స్‌ అధికారి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని