నిబంధనలు పాటించాలి
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

నిబంధనలు పాటించాలి

దుకాణదారులకు సూచనలు చేస్తున్న ఏసీపీ ఆంజనేయులు, సీఐ శ్రీధర్‌

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: బాణసంచా దుకాణదారులు, కొనుగోలుదారులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పట్టణ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా స్టాళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండడంతోపాటు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని యజమానులకు సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా సురక్షిత చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే దుకాణాలు సీజ్‌ చేస్తామని, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాకుండా ఇళ్లు, హోల్‌సేల్‌ దుకాణాల్లో విక్రయాలు జరిపితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని