రుణ పంపిణీలో జాప్యం వద్దు
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

రుణ పంపిణీలో జాప్యం వద్దు

అవగాహన కల్పిస్తున్న సెర్ప్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డి

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు అనుసంధాన రుణాల పంపిణీలో ఎలాంటి జాప్యం వహించవద్దని, జిల్లాను అగ్రభాగాన ఉంచాలని సెర్ప్‌ బ్యాంకు లింకేజీ, ఐబీ డైరెక్టర్‌ వై.నరసింహారెడ్డి అన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంకు అనుసంధాన రుణాలు అందిస్తున్నామని, అయితే ఇటీవల మంచి ప్రతిభ కనబరిచిన సంఘాలకు రూ.20లక్షల వరకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణ పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా బ్యాంకర్లు సహకరించాలన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సెర్ప్‌ డీపీఎం, ఏపీఎంలకు గ్రామ సమాఖ్యల సంస్థాగత నిర్మాణం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెర్ప్‌ ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్‌లు నరసింహాస్వామి, వీరమల్లు, శిక్షణ ఐఏఎస్‌ బి.రాహుల్‌, డీఆర్డీవో ఎం.విద్యాచందన, డీపీఎంలు (బ్యాంకు లింకేజీ, ఐబీ) ఆంజనేయులు, మాణిక్‌రెడ్డి, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌, నాబార్డు డీజీఎం, ఎస్‌బీఐ, ఏపీజీవీబీ బ్యాంకుల ఆర్‌ఎంలు, ఫీల్డ్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని