టీకాతోనే కొవిడ్‌ నుంచి రక్షణ
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

టీకాతోనే కొవిడ్‌ నుంచి రక్షణ

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: మూడో దశ కరోనా ముప్పు ఇంకా తొలగి పోలేదని, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోడానికి ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు. మండల స్థాయిలో అధికారుల పర్యవేక్షణలోపంతోనే వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రస్తుతం మందగించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కార్యదర్శులు, వీఆర్‌ఏ, ఆశా, అంగన్‌వాడీ సిబ్బందితో మల్టీలెవల్‌ డిసిప్లీనరీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌పై మండల ప్రత్యేకాధికారులు, వైద్య, పురపాలక కమిషనర్లు, తహసీల్దార్లు, ఎండీవోలు, ఎంపీఓలతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ బుధవారం నిర్వహించారు. వంద శాతం టీకా లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలన్నారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న ప్రదేశాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం ఆలయం వద్ద మొబైల్‌ వాహనం ఏర్పాటు చేసి భక్తులకు టీకా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ అశోక్‌ చక్రవర్తి, జిల్లా వైద్యాధికారి శిరీష, డీపీఓ రమాకాంత్‌, జడ్పీ సీఈఓ విద్యాలత పాల్గొన్నారు.
కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో శత శాతం టీకా సాధన ప్రణాళికలపై డీఎంహెచ్‌ఓ శిరీష వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన టీకా పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడి ఉన్న మండలాలు, ప్రాంతాలను గుర్తించి ఒక జాబితా రూపొందించాలని సూచించారు. జిల్లాను ముందంజలో ఉంచాలంటే నిర్విరామంగా టీకా పంపిణీని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌ అధికారి నాగేంద్రప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ  పి.వినోద్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసరావు, ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ అధికారి ప్రసాద్‌, భావ్‌సింగ్‌, వైద్యులు చేతన్‌, సుకృత, స్వాతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ శిరీష


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని