ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

ఘనంగా సీతారామ కల్యాణోత్సవం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమంజనం చేసి భక్తులకు ఆశీర్వచనం అందించారు. సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చనలను పఠించారు. స్వామివారు దివి నుంచి భువికి దిగివచ్చిన తీరును వైదిక పెద్దలు చెప్పి అలరించారు. క్షేత్ర మహాత్మ్యంపై సాగిన ప్రవచనం ఆకట్టుకోగా పులకించిన భక్తులు రామనామాలను స్మరిస్తు జైశ్రీరామ్‌ అంటూ నీరాజనాలు పలికారు. వైష్ణవ సంప్రదాయం మేరకు విష్వక్సేనుడ్ని పూజించి పుణ్యాహ వాచనం చేశారు. కన్యాదానం కంకణాల ధారణ క్రతువును కమనీయంగా కొనసాగించారు. సీతమ్మకు పవిత్రమైన యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. నిత్య కల్యాణ క్రతువు గురించి అర్చకులు వివరిస్తు మాంగళ్యధారణను నయనానందకరంగా నిర్వహించారు. తలంబ్రాల వేడుక ఆధ్యాత్మికతను పెంచగా దర్బారు సేవ మరింత వైభవాన్ని సంతరింపజేసింది. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారు అమ్మ కోవెళ్లను దర్శించిన భక్తులు పూజలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని