సైబర్‌ నేరస్థుడి నిర్బంధం
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

సైబర్‌ నేరస్థుడి నిర్బంధం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలంలో సైబర్‌ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం నిర్బంధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏఎప్పీ డా.వినీత్‌ వివరించారు. సీఐ స్వామికి నమ్మదగిన సమాచారం అందడంతో తన సిబ్బందితో ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని నాగమల్లి తోటకు చెందిన డాకి కిషోర్‌ ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను గడిచిన ఏప్రిల్‌లో స్థానిక అటవీశాఖ కార్యాలయం సమీపంలోని అనురాధ దేవి ఖాతా నుంచి రూ.93 వేలు కాజేశాడు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మోసపూరితంగా సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఇతన్ని నిర్బంధించినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని