రూ.7.50 లక్షల గంజాయి స్వాధీనం
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

రూ.7.50 లక్షల గంజాయి స్వాధీనం


పట్టుబడిన వ్యక్తులు, గంజాయితో ఆబ్కారీ పోలీసులు

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలం పట్టణంలో సుమారు రూ.7.50 లక్షల విలువైన 75 కిలోల గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు ఆబ్కారి సీఐ సర్వేశ్వరరావు బుధవారం పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బస్టాండు, అంబేడ్కర్‌ సెంటర్‌, బ్రిడ్జి సెంటర్లలో తనిఖీలు చేశామన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకున్న వారు బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారు. నిందితుల్లో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని