బూడిద పైపుల చోరీ యత్నం
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

బూడిద పైపుల చోరీ యత్నం

సంఘటన స్థలంలో ఇనుప బూడిద పైపులు

పాల్వంచ కేటీపీఎస్‌, న్యూస్‌టుడే:  కేటీపీఎస్‌లో ఓఅండ్‌ఎం కర్మాగారానికి చెందిన బూడిద పైపుల చోరీయత్నం వెలుగులోకి వచ్చింది. ఏ స్టేషన్‌ వెనుక భాగంలో బూడిద చెరువు సమీపంలో పైపులను 25 ముక్కలుగా వేరు చేశారు. వాటిని తీసుకెళ్లడానికి సిద్ధం చేసుకున్నారు. బుధవారం దీన్ని గుర్తించిన సమీప గ్రామాల పశువుల కాపరులు విజిలెన్స్‌, ఎస్పీఎఫ్‌ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముక్కలుగా చేసిన పైపులను ఓఅండ్‌ఎం విద్యుత్కేంద్రానికి తీసుకొచ్చారు. ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పసుమర్తి కోటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పైపులను మీటర్‌ చొప్పున గ్యాస్‌కటర్‌తో వేరు చేశారని.. వాటిని తరలించేలోపే సమాచారం రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని