కేటీపీఎస్‌లో ప్రమాదం.. కూలీ దుర్మరణం
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

కేటీపీఎస్‌లో ప్రమాదం.. కూలీ దుర్మరణం

సంఘటనా స్థలంలో తీవ్రగాయాలతో మంగీలాల్‌, సంతోష్‌

పాల్వంచ కేటీపీఎస్‌, న్యూస్‌టుడే: కేటీపీఎస్‌ 800 మెగావాట్ల సామర్థ్యం గల ఏడో దశకు బొగ్గు సరఫరా చేసే కోల్‌ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్డు రేకులు మారుస్తున్న రోజు కూలీల్లో ఇద్దరు జారి కిందపడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందారు. రేకులు మార్చే పనిని చందర్‌ అనే గుత్తేదారుడు చేపడుతున్నాడు.  ఆయన వద్ద పని చేసేందుకు కరకవాగుకాలనీకి చెందిన భట్టు మంగీలాల్‌, భట్టు సంతోష్‌ రోజుకూలిపై వచ్చారు.  షెడ్డు పైకి ఎక్కిన సమయంలో పాత రేకులు ధ్వంసమై అత్యంత ఎత్తునుంచి కిందపడ్డారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు కూలీల సమాచారంతో గుత్తేదారుడు, కేటీపీఎస్‌ సివిల్‌ విభాగం అధికారులు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ కొత్తగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మంగీలాల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

కూలీలు జారిపడిన షెడ్డు పైకప్పు ఇదే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని