వీకే-7 గనికి.. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

వీకే-7 గనికి.. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: మూడు దశాబ్దాలుగా కొత్తగూడెం ఏరియాలో నల్ల బంగారాన్ని అందించిన గౌతంఖని (జీకే) ఉపరితల గని ప్రస్తుత ఉత్పత్తి సంవత్సరంతో మూతపడనుంది. దీని స్థానంలో వీకే-7 విస్తరణకు నిర్ణయించగా.. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. గతంలో మైదాన ప్రాంతాల్లో ఉపరితల గనులు(ఓసీ) ఏర్పాటు చేసేవారు. కానీ భూగర్భ గనులపై వీటిని ఏర్పాటు చేసే ప్రయోగం 1993లో జేసీ ఖనితో మొదలైంది. 8 నుంచి 11 వరకు విస్తరించిన ఇంక్లైన్ల(భూగర్భగనుల)పై మిగిలిన నిక్షేపాల వెలికితీతకు దీన్ని ప్రారంభించారు. భూగర్భ గనుల్లో గోడలు, సపోర్టింగ్‌ కింద 40 నుంచి 50 శాతం నిక్షేపాలు వదిలేస్తుంటారు. వీటి వెలికితీతకు ఓసీలు నెలకొల్పుతారు. ఈ ఏడాదితో కలిపి జేసీ ఖని 28 ఏళ్లు ఉత్పత్తి కొనసాగించడం విశేషం. ‘వచ్చే ఏడాది వీకే-7 ఓసీ విస్తరించనున్నాం. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ సూచనలు పాటిస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ అనుమతితో అతి త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని’  జీఎం నర్సింహారావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని