9,749 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

9,749 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన వ్యాక్సిన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో 9,749 మందికి టీకా పంపిణీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 11,600 మందికి టీకా పంపిణీ లక్ష్యంగా నిర్ధేశించగా 84 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మొత్తం 811 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని