లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి: కలెక్టర్‌

చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్‌ అనుదీప్‌ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సురేందర్‌ తదితరులు

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కలెక్టర్‌ అనుదీప్‌ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుదీప్‌ మాట్లాడుతూ రాజకీయ మేధావిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా బాపూజీ ఆచరించిన సిద్ధాంతాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినీ వదిలిపెట్టిన మహనీయుడన్నారు. ఆయన ఆశయాల సాధనకు సమష్టి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీˆ సంక్షేమాధికారి సురేందర్‌, బీసీˆ సంఘాల నాయకులు మాడిశెట్టి శ్రీనివాస్‌, కొల్లు పద్మ, రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

* ‘ప్రజావాణి’ కార్యక్రమానికి గైర్హాజరైన జిల్లా స్థాయి అధికారులకు షోకాజ్‌ నోటీసులివ్వాలని కలెక్టర్‌ అనుదీప్‌ డీఆర్వో అశోక చక్రవర్తిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన వారి నుంచి వివరణ తీసుకోవాలన్నారు. సమీక్ష అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి ఆయా అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని