‘ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ బావుటా’
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

‘ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ బావుటా’

టేకులపల్లిలో బంద్‌లో పాల్గొన్నమాజీ ఎమ్మెల్యే గుమ్మడి, అఖిలపక్ష నాయకులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణను, కార్మిక చట్టాల సవరణను అడ్డుకొంటామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వంగా వెంకట్, జీ.వీరాస్వామి అన్నారు. భారత్‌ బంద్‌ కార్యక్రమంలో భాగంగా వారు సోమవారం వివిధ గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. సముద్రాల సుధాకర్‌, కే.రాములు, గట్టయ్య, రవి, మధుకృష్ణ, నాగేశ్వరరావు, హుమాయూన్‌, మల్లికార్జున్‌రావు, నర్సింహారావు, భరణి పాల్గొన్నారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం టీఎస్‌యూఈఈయు, 1104, సీˆఐటీయూ, 327 సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట  ధర్నా చేపట్టారు. నాయకులు పులి గణేష్‌, కొండల్‌, హేమాంబందర్‌రావు, రాజారావు, అశోక్‌, నర్సింహారావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పాల్వంచ (కేటీపీఎస్‌), న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లు సవరణకు వ్యతిరేకంగా, భారత్‌ బంద్‌కు మద్దతుగా పాల్వంచ కేటీపీఎస్‌ విద్యుత్కేంద్రంలో ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇంజినీర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు సీఈల అనుమతితో ఐదు, ఆరు, ఏడో దశల కర్మాగారాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమీర్‌, కృష్ణయ్య, మురళీకృష్ణ, కేవీరామారావు, రాధాకృష్ణ, బ్రహ్మజీ, మహేశ్‌, రాజేందర్‌, కోటేశ్వరరావు, శ్రీనివాసచారి, లక్ష్మణ్‌, ప్రదీప్‌, నరసింహారావు పాల్గొన్నారు.
పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: బంద్‌కు పాల్వంచ వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. ప్రయాణికుల రాకపోకలు లేకపోవడంతో బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారింది. ఏఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు ప్రవీణ్‌, రతీశ్‌ నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించారు. పాల్వంచ-భద్రాచలం రహదారిపై అఖిలపక్షం నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను ఠాణాకు తరలించగా.. వారి అరెస్టులను వామపక్షాల నాయకులు ఖండించారు.
ఇల్లెందు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన భారత్‌బంద్‌కు ప్రజలు, వ్యాపారులు, కార్మికులు సహకరించి మద్దతు తెలిపారు. వర్షం కురుస్తున్నా.. అఖిలపక్ష నాయకులు పట్టణంలో పర్యటించి నిరసన తెలిపారు. కొత్తబస్టాండ్‌కు వెళ్లి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. నాయకులు చీమల వెంకటేశ్వర్లు, ముద్రగడ వంశీ, సీతారామయ్య, నభీ, సారయ్య, నాగయ్య, రాజు, నాగేశ్వరరావు, సైదులు, డానియోలు, దళ్‌సింగ్‌నాయక్‌, రాంసింగ్‌ పాల్గొన్నారు.
టేకులపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అఖిలపక్షం నాయకులు సురేందర్‌రావు,  దళ్‌సింగ్‌నాయక్‌, వీరబ్రహ్మాచారి, ఊక్లా, శ్రీనివాస్‌, రాంచందర్‌, సంజీవరావు, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. టేకులపల్లిలో చేపట్టిన బంద్‌లో వారు పాల్గొని మాట్లాడారు.  మాన్‌సింగ్‌, ప్రసాద్‌, ప్రశాంత్‌, బాలాజీ, సాయి, దేవా, శ్రీను, లక్ష్మయ్య, నరసింహారావు పాల్గొన్నారు.
సుజాతనగర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యాన సుజాతనగర్‌ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. చింతలపూడి రాజశేఖర్‌, నాగార్జున, వీర్ల రమేశ్‌, దస్రు, జక్కుల రాములు పాల్గొన్నారు.  
జూలూరుపాడు, న్యూస్‌టుడే: భారత్‌ బంద్‌లో భాగంగా జూలూరుపాడులో సోమవారం వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. నిరసనకారులు ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. నాయకులు జి.వెంకటేశ్వర్లు, నరేంద్ర, స్వరాజ్యరావు, భిక్షం, కొండలరావు, ధర్మా, గోపాలరావు, మంగీలాల్‌, సీహెచ్‌ కృష్ణయ్య, మంద బాబు, టి.నరసింహారావు, ఎల్‌హెచ్‌పీఎస్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని