తలో చేయి.. ఆదుకున్నారోయి..
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

తలో చేయి.. ఆదుకున్నారోయి..

ప్రియాంకకు నగదు అందిస్తున్న జీఎం పద్మనాభరెడ్డి, కరస్పాండెంట్ అజయ్‌కుమార్‌, సిబ్బంది

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాలలో జూనియన్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న ప్రియాంక అనే ఉద్యోగిని భర్త అరుదైన వ్యాధితో బాధపడుతుండగా సింగరేణి విద్యావిభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది ఆమెకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. డిగ్రీ, పీజీ కళాశాల, జూనియర్‌ కళాశాల, ఉన్నతపాఠశాల, సింగరేణి ఎడ్యుకేషన్‌ సొసైటీ సిబ్బంది నుంచి సేకరించిన మొత్తాన్ని సోమవారం డిగ్రీకళాశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో జీఎం పద్మనాభరెడ్డి, కరస్పాండెంట్ కె.అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రియాంకకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ జి.మంజుల, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సంధ్యారాణి, అధ్యాపకులు డాక్టర్‌ కె.సావిత్రి, ఎస్‌.శ్రీలత, శ్రీలత, మౌలానా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పూల్‌సింగ్‌ పాల్గొన్నారు.
ఉపరితలగని నిర్వాసితులకు ఉద్యోగం
ఇల్లెందు సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి జేకే-5 ఉపరితల గనిలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లో నలుగురికి సోమవారం జీఎం సుబ్బారావు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఇద్దరు పురుషులకు శ్రీరాంపూర్‌లో, ఇద్దరు మహిళలకు ఇల్లెందు సింగరేణిలో ఉద్యోగాలు చేసుకునే విధంగా నియమించామన్నారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం బండి వెంకటయ్య, ఏరియా రక్షణాధికారి పంజాల శ్రీనివాసు, డీజీఎం పర్సనల్‌ జీవీ మోహన్‌రావు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల సాధనకు కృషి
టేకులపల్లి, న్యూస్‌టుడే: సింగరేణి కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెబొగకాసం ఇల్లెందు బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.రంగనాథ్‌ అన్నారు. సోమవారం కోయగూడెం ఉపరితలగనిని సందర్శించిన ఆయనను సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, అశోక్‌, నాగేశ్వరరావు, జనార్దన్‌రెడ్డి, సమ్మయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ఇల్లెందు, న్యూస్‌టుడే: వర్షానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జేకే 5 ఉపరితల గనిలో సుమారు 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, సుమారు 4వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పూడికతీత పనులకు ఆటంకం ఏర్పడింది. ఇల్లెందులపాడు చెరువులో పెద్ద ఎత్తున వరద నీరు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని