డెంగీతో నవ వధువు మృతి
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

డెంగీతో నవ వధువు మృతి

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: డెంగీ జ్వరంతో నవ వధువు మృతిచెందింది. అశ్వాపురం గ్రామానికి యువతి(22)కి పాల్వంచ మండలం ఉల్వనూరుకు చెందిన యువకుడితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. నవ వధువుకు ఈ నెల 23న డెంగీ జ్వరం రావడంతో ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయి. దీంతో ఆమెకు పాల్వంచ, ఖమ్మంలో కుటుంబీకులు చికిత్స చేయించారు. అయినా లాభం లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం నవ వధువు మృతిచెందింది. సోమవారం తెల్లారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన బంధువులు అంత్యక్రియలు జరిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని