‘పోడు’ సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే హరిప్రియ
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

‘పోడు’ సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు, న్యూస్‌టుడే: పోడు భూముల సమస్యలపై సీఎం కేసీఆర్‌ మంత్రులతో సబ్‌ కమిటీ వేయడం సంతోషకరమని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే  హరిప్రియ సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. ఎస్‌డీఎల్‌సీ, డీఎల్‌సీ అప్రూవల్స్‌ నిలిచిపోయాయని వాటిని తిరిగి కొనసాగించాలన్నారు. డీఎల్‌సీ ఆలస్యం కావడం వల్ల రైతులకు రావాల్సిన రైతుబంధు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటవీశాఖ అధికారులు నేటికీ రైతులకు నోటీసులు ఇస్తున్నారన్నారు. కందకాలు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘గిరి వికాస్‌’ కింద మంజూరైన బోర్లను రైతులు వేసుకునేలా అటవీ అధికారులకు స్పష్టత ఇవ్వాలని సభలో కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని