పోస్టుల భర్తీకి దరఖాస్తులు
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 86 పల్లెదవాఖానాలకు వైద్యాధికారులను నియమించేందుకు దరఖాస్తులు కోరుతూ డీఎంహెచ్‌వో డా.మాలతి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంబీబీఎస్‌ పూర్తయి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని 34 ఏళ్ల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు. అంగవైకల్యం కలిగిన వారికి, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌కు వయో పరిమితి సడలింపు ఉంటుందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్న ఈ పోస్టులకు అక్టోబరు 12 సాయంత్రం 5గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని