తుపాను ప్రభావంపై నామా ఆరా
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

తుపాను ప్రభావంపై నామా ఆరా

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: గులాబ్‌ తుపాను తీవ్రతపై ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం చరవాణి ద్వారా జిల్లా అధికారులను ఆరా తీశారు. తుపాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
* తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ పోరాటం వరకు ఆయన సేవలు మరువలేనివన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని