మహమ్మద్‌ ఫర్హాకు గౌరవ డాక్టరేట్‌
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

మహమ్మద్‌ ఫర్హాకు గౌరవ డాక్టరేట్‌

గౌరవ డాక్టరేట్‌ స్వీకరిస్తున్న మహమ్మద్‌ ఫర్హా

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరానికి చెందిన మహమ్మద్‌ ఫర్హాకు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్‌(వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌-డబ్ల్యూహెచ్‌ఆర్‌పీసీ) నుంచి గౌరవ డాక్టరేట్‌ లభించింది. ఈ నెల 26న దిల్లీలోని ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(ఐఐసీ)లో జరిగిన కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌ఆర్‌పీసీ అంతర్జాతీయ కార్యదర్శి మాక్సిమ్‌ సెంగియుంవా చేతుల మీదుగా డాక్టరేట్‌తో పాటు అంతర్జాతీయ గౌరవ సభ్యత్వం అందుకున్నారు. గతంలో మిస్సెస్‌ ఇండియా రన్నరప్‌గా మహమ్మద్‌ ఫర్హా గుర్తింపు పొందారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దేశాయ్‌, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సార్డిన్హా, డబ్ల్యూహెచ్‌ఆర్‌పీసీ అంతర్జాతీయ డైరెక్టర్‌ డా.అభిన్న హోటా, ఛైర్మన్‌ తపన్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని