ముత్తంగి రూపంలో మురిపించిన రామయ్య
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

ముత్తంగి రూపంలో మురిపించిన రామయ్య

రామయ్యకు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వర్షం వల్ల భక్తులు ఇబ్బందులు పడినప్పటికీ వారానికి ఒకసారి ఉండే ముత్తంగి రూప దర్శనం మంత్రముగ్ధులను చేసింది. ఆలయం తలుపులు తెరిచాక అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన చేశారు. క్షేత్ర విశిష్టత అలరించింది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ పుణ్యాహ వాచనం చేశారు. ప్రవర పఠించి గోత్రనామాలను చదివారు. కంకణధారణ కన్యాదానం కొనసాగించి సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. మాంగళ్యధారణ రమణీయంగా సాగింది. తలంబ్రాల వేడుక పరమానందం కలిగించగా దర్బారు సేవ ఆధ్యాత్మికతను చాటింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుడ్ని, లక్ష్మీతాయారు అమ్మను దర్శించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని